ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం : మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్

ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం : మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
  •     మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల మహానాడు నాయకులు అన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్​బాబు అధ్యక్షతన ఆదివారం బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరుగుతున్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలన్నారు. ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉపకులాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది మాలల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

తలమల్ల శ్వేత, కమలారాణి, మన్నే శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్ల కారణంగా గత ఏడాది విడుదలైన పలు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలలు, ఇతర 26 ఎస్సీ ఉపకులాలకు తగిన ప్రాతినిథ్యం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించి రోస్టర్ పాయింట్ల విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాదాసు రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, రాజలింగం, ప్రొఫెసర్ ఈశ్వరయ్య, భత్తుల రాంప్రసాద్, తాలూకా రాజేశ్, ప్రొఫెసర్ వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.