ఇండియాలో తగ్గుతున్న మలేరియా కేసులు

ఇండియాలో తగ్గుతున్న మలేరియా కేసులు

డబ్ల్యూహెచ్‌‌వో రిపోర్టు

ప్రపంచంలో మలేరియా కేసులు ఎక్కువ నమోదయ్యే దేశాల్లో ఇండియా ఒకటి. కానీ మన ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల వల్ల ఏటేటా వ్యాధి కేసులు తగ్గుతూ వస్తున్నాయి. 2017, 2018 మధ్య మలేరియా కేసులు 28 శాతం వరకు తగ్గాయి. ఈ మేరకు వరల్డ్‌‌ హెల్త్‌‌ ఆర్గనైజేషన్‌‌ తన ‘వరల్డ్‌‌ మలేరియా రిపోర్టు 2019’లో వెల్లడించింది. 2018లో 26 లక్షల మందికి రోగమొస్తే, 2017లో 15 లక్షల మంది వ్యాధితో బాధపడ్డారని తెలిపింది. 2016, 2017ల్లోనూ కేసులు 24 శాతం తగ్గాయంది. ప్రపంచవ్యాప్తంగా మలేరియాపై ఫైట్‌‌ చేసేందుకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్న 11 దేశాల్లో ఇండియా కూడా ఉందని రిపోర్టు వెల్లడించింది. మలేరియా వల్ల 2018లో ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మంది చనిపోయారని పేర్కొంది. అదే 2017లో 4.16 లక్షల మంది, 2016లో 5.85 లక్షల మంది మరణించారని తెలిపింది.