- నటి సజిని ఆవేదనజూబ్లీహిల్స్లో రోడ్డెక్కిన పంచాదీ
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి శ్రావంతి నగర్లో ఆస్తి తగాదాల కారణంగా మలయాళీ నటి దేవి అలియాస్ సజిని, ఆమె అక్క ప్రమీల కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఏప్రిల్ 11న ఇరువర్గాలు రోడ్డుపై పడి బాహాబాహీకి దిగడంతోపాటు ప్రజలకు అసౌకర్యం కలిగించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విచారణలో వీరు ఒకే ఇంట్లో నివసిస్తూ తరచూ ఆస్తి వివాదం కారణంగా గొడవపడుతున్నారని తెలిసింది.
గతంలోనూ వీరి మధ్య గొడవలు జరగగా, పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ మళ్లీ ఘర్షణకు దిగారు. తాను 2001లో సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో అమ్మ పేరు మీద ఇల్లు కొన్నానని, రెండో పెండ్లి చేసుకుని వెళ్లిపోయిన తన అక్క పిల్లలను కూడా తానే పెంచి పెద్ద చేశానని, కానీ ఇప్పుడు వారే తనపై దాడికి దిగుతున్నారని నటి సజిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సజినితో పాటు మరో వర్గానికి చెందిన ప్రమీల, శ్రీజ, విజయ్ కుమార్ సహా మొత్తం 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

