- తన కుర్చీలో కూర్చోబెట్టి,టోపీ తొడిగిన సుమతి
నేరేడ్మెట్/మల్కాజ్గిరి, వెలుగు: పుట్టుకతోనే వైకల్యం కారణంగా నడవలేని దమ్మాయిగూడ యువకుడు రాహుల్.. తాను ఒక్కరోజైనా పోలీస్ఆఫీసర్కుర్చీలో కూర్చోవాలని కలగన్నాడు. మల్కాజ్‌గిరి సీపీ సుమతి సోమవారం రాహుల్‌ను కమిషనరేట్‌కు పిలిపించారు. అతన్ని తన కుర్చీలో కూర్చోబెట్టి, టోపీ తొడిగి ఆనందాన్ని రెట్టింపు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన తిరుమలరావు-–రాధమ్మ దంపతులు దమ్మాయిగూడకు వలస వచ్చారు.
వారి కుమారుడైన రాహుల్ నడవలేక, మాటలు సరిగా రాక ఇబ్బంది పడుతున్నాడు. వికలాంగుల హక్కుల సాధన సమితి నేత మెరుగు శివకృష్ణ, ప్రతిమ ఫౌండేషన్ చైర్పర్సన్ రష్మిత అతనికి వీల్‌చైర్ అందించి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ.. దివ్యాంగుల పట్ల అందరూ ఆదరణ చూపాలని, స్వచ్ఛంద సంస్థలు నిస్వార్థంగా సేవలందించాలని పిలుపునిచ్చారు. తమ కొడుకు కల నెరవేర్చిన సీపీకి రాహుల్తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
