హైదరాబాద్ సిటీ, వెలుగు : పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిటీలోని పార్కుల నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించే పైలట్ ప్రాజెక్టుకు మల్కాజిగిరి మున్సిపల్కార్పొరేషన్శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి జోన్‌లో కనీసం రెండు పార్కులను మహిళా సంఘాలకు కేటాయించారు. ఈ పార్కుల్లో పరిశుభ్రత, మొక్కల సంరక్షణ, నీటి సరఫరా, ఉద్యానవన మెయింటనెన్స్తదితర రోజువారీ పనులను అర్బన్ బయోడైవర్సిటీ సిబ్బంది సాంకేతిక మార్గదర్శకత్వంలో మహిళా సంఘాలే చూసుకోనున్నాయి.
ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే, ప్రస్తుతం కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో ఉన్న ఇతర పార్కులను సైతం దశలవారీగా మహిళా సంఘాలకే అప్పగించనున్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఈ ప్రాజెక్టులో పాల్గొనే సంఘాలకు ఈఎండీ, జీఎస్టీ, లేబర్ లైసెన్స్ తదితర వాటి నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
