V6 News

మ్యాపింగ్ చేసుకోకపోతే ఓటు ఉండదు : మల్కాజి గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్

మ్యాపింగ్ చేసుకోకపోతే ఓటు ఉండదు : మల్కాజి గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్
  •     తొలుత మున్సిపల్ సిబ్బందికే ఈ అవకాశం 
  •      మల్కాజిగిరి జోనల్ కమిషనర్ వెల్లడి

మల్కాజిగిరి, వెలుగు: మున్సిపల్ సిబ్బంది అందరూ తమ ఓట్లను తప్పనిసరిగా 2025 ఓటరు జాబితాకు మ్యాపింగ్ చేయించుకోవాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. జోనల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

ప్రజలకు అవగాహన కల్పించే మున్సిపల్ సిబ్బందికి ముందుగా ఈ అవకాశం కల్పించామని, ఏప్రిల్ 25 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామన్నారు. శుక్రవారం కూడా కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో ఏఈఆర్వో దయానంద్, సూపర్ వైజర్ ఆఫీసర్లు, బీఎల్​వోలు పాల్గొన్నారు.