ఏండ్లుగా రోడ్లపై బండ్లు తొలగింపు.. మల్కాజిగిరి మున్సిపల్ ఏరియాలో 89 వాహనాలు సీజ్

ఏండ్లుగా రోడ్లపై బండ్లు తొలగింపు.. మల్కాజిగిరి మున్సిపల్ ఏరియాలో 89 వాహనాలు సీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ రోడ్లపై ఏండ్లుగా పనికిరాకుండా పడి ఉన్న వాహనాలను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) అధికారులు తొలగిస్తున్నారు. సోమవారం నుంచి అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. గతంలో జీహెచ్ఎంసీ  ఈ డ్రైవ్ నిర్వహణకు ప్లాన్ చేసింది. విభజన తరువాత ఎంఎంసీ అధికారులు మొదలుపెట్టారు.

ఇలా ఒక్కరోజులోనే  ఎంఎసీ పరిధిలోరి 14 సర్కిల్స్ లో 89 పాత వాహనాలను ట్రాఫక్ పోలీసుల సాయంతో తరలించారు. పాత బండ్లను వాడకుండా రోడ్లపై పెట్టడడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతోపాటు చుట్టూ దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు  అన్ యూజ్డ్ వాహనాలను తొలగిస్తున్నట్లు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.  ఈ డ్రైవ్‌‌‌‌లో సేకరించిన వాహనాలను పలు ప్రాంతాలకు తరలించారు.