శంషాబాద్‌‌ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ట్రయల్ చేస్తానని బుల్లెట్ తో పరార్

 శంషాబాద్‌‌ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ట్రయల్ చేస్తానని బుల్లెట్ తో పరార్

గండిపేట,వెలుగు: శంషాబాద్‌‌లోని మధురానగర్‌‌లోని రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌ షోరూంలో ఓ వ్యక్తి బైక్​ట్రయల్​చూస్తానని చెప్పి వాహనంతో సహా పరారయ్యాడు. ఆదివారం ఓ వ్యక్తి బైక్ కొంటానంటూ కస్టమర్ లాగా షోరూమ్‌‌లోకి వచ్చాడు. టెస్ట్ రైడ్ చేస్తానని చెప్పి ఫామ్‌‌లో తప్పుడు పేరు, నకిలీ ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ రాశాడు. తర్వాత షోరూమ్ సిబ్బంది బైక్  ఇవ్వడంతో స్టార్ట్ చేసి రోడ్డుపైకి వెళ్లాడు. 

అలా వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో షోరూమ్ సిబ్బంది ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్​వచ్చింది. దీంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో అతడు మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ టీవీ విజువల్స్​ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.