మెడికల్ షాపులో బీర్లు..నిర్వాహకుడి అరెస్టు

మెడికల్ షాపులో బీర్లు..నిర్వాహకుడి అరెస్టు

నాగ్​పూర్: లాక్ డౌన్ అమలుతో మందు దొరకట్లేదు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని మెడికల్ షాప్ లో అక్రమంగా బీర్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వైన్ షాపులన్నీ మూతపడటంతో మహారాష్ట్రలోని నాగ్​పూర్ లో నిశాంత్ అలియాస్ బంటీ ప్రమోద్ గుప్తా(36) తన ఫార్మసీలో బీరు అమ్మేందుకు ప్రయత్నించాడని, అతడ్ని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. మరో వ్యక్తి పారిపోయాడని చెప్పారు. దుకాణంలో మంగళవారం సోదాలు చేయగా.. మినరల్ వాటర్ బాక్సుల్లో నిల్వ ఉంచిన 80 బీరు బాటిల్స్ దొరికాయని, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.