- పెండింగ్ చలాన్లు ఉన్నయని బైక్‌ను తగులబెట్టిండు
వికారాబాద్, వెలుగు: పెండింగ్ చలాన్లు ఉన్నయని ఓ వ్యక్తి బైక్‌ను తగులబెట్టిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. పెద్దేముల్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి తలారి సంగప్ప లైసెన్స్ ,హెల్మెట్, మాస్కు లేకుండా డ్రైవ్ చేసినందుకు అతడి బైక్ పై రూ. 4,800 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఆదివారం రాత్రి తాండూర్ మండలం కరన్‌కోట్ నుంచి పెద్దేముల్కి వెళ్తున్న సంగప్పను వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. పెండింగ్ చలాన్లు చెల్లిస్తేనే బైక్‌ను విడిచిపెడతామన్నారు. అక్కడి నుంచి బైక్‌పై పరారైన సంగప్ప పెద్దేముల్కి వెళ్లాడు. గ్రామ శివారులో బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ విషయమై ఎస్ఐ గఫార్‌ను వివరణ కోరగా..కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
