అహ్మదాబాద్‌ లో రూ.20 లంచం కేసులో వ్యక్తికి 30 ఏండ్ల జైలు

అహ్మదాబాద్‌ లో రూ.20 లంచం కేసులో వ్యక్తికి 30 ఏండ్ల జైలు
  • నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే మృతి

అహ్మదాబాద్‌: న్యాయం జీవిత కాలం ఆలస్యం అంటే ఇదేనేమో.. చేయని తప్పుకు ఓ వ్యక్తి 30 ఏండ్ల పాటు జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చిన మరుసటి రోజే మరణించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. 1996లో బాబుభాయ్‌ ప్రజాపతి పోలీస్‌ కానిస్టేబుల్‌గా అహ్మదాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. 

ఆ సమయంలో అతనిపై రూ.20 లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అవినీతి నిరోధక చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. 1997లో సెషన్స్‌ కోర్టులో ఆయనపై చార్జ్​షీట్‌ దాఖలైంది. 2002లో దీనికి సంబంధించి అభియోగాలు మోపారు. 2003లో సాక్షుల విచారణ ప్రారంభమైంది. ప్రజాపతికి 2004లో సెషన్‌ కోర్టు నాలుగేండ్ల జైలుశిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. 

సెషన్స్‌ కోర్టు తీర్పును గుజరాత్‌ హైకోర్టులో ప్రజాపతి సవాల్‌ చేశారు. దానిని హైకోర్టు 22 ఏండ్ల పాటు అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు పెండింగ్‌లో పెట్టింది. తర్వాత కేసును విచారించగా, ప్రజాపతి నిర్దోషిగా తేలింది. దీంతో అతన్ని విడుదల చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. విడుదలైన మరుసటి రోజే ప్రజాపతి గుండెపోటుతో మృతి చెందారు.