డైరెక్టర్ అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు” (MSVPG) . సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. థియేటర్లలో దాదాపు ఒక నెల రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ముందుకు రానుంది.
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ:
“మన శంకర వరప్రసాద్ గారు” మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee5) డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా ఏడు భాషల్లో కావడం విశేషం. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో రానుంది.
ఈ విషయాన్ని జీ5 తన ప్లాట్ఫామ్లో కన్ఫమ్ చేసింది. అయినప్పటికీ, డేట్ అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ మూవీ గురించి జీ5లో సెర్చ్ చేసినప్పుడు,స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఫిబ్రవరి 11 అని ఉంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ మూవీ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇకపోతే, ఈ మూవీ పంచవ్యాప్తంగా రూ.360 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించడంతో పాటు మెగాస్టార్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
When the BOSS arrives, records surrender 😎 😎
— Shine Screens (@Shine_Screens) January 27, 2026
Megastar @KChiruTweets continues his record-breaking spree, setting yet another HISTORIC BENCHMARK in Telugu cinema ❤️🔥
₹358 Crore+ Worldwide Gross in 15 days for #ManaShankaraVaraPrasadGaru 💥
ALL-TIME REGIONAL INDUSTRY… pic.twitter.com/TEWKH5YDTn
