Manchu Lakshmi: చెన్నై హోటల్‌లో మంచు లక్ష్మికి చేదు అనుభవం.. ఎక్కడా ఇలాంటి పిచ్చి రూల్స్ లేవు అంటూ ఫైర్!

Manchu Lakshmi: చెన్నై హోటల్‌లో మంచు లక్ష్మికి చేదు అనుభవం.. ఎక్కడా ఇలాంటి పిచ్చి రూల్స్ లేవు అంటూ ఫైర్!

నటి, నిర్మాత మంచు లక్ష్మి అంటేనే ముక్కుసూటితనం. తనకి అనిపించిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఆమె నైజం. అయితే లేటెస్ట్ గా లక్ష్మికి చెన్నైలో ఊహించని ఇబ్బంది ఎదురైంది. తన తాజా చిత్రం ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లిన ఆమెకు, అక్కడ బస చేసిన గ్రీన్ పార్క్ హోటల్‌ యాజమాన్యంతో వాగ్వాదం జరిగింది. హోటల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అసలేం జరిగింది?

మంచు లక్ష్మి తన తాజా చిత్రం 'బూకి' తెలు ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లారు. అక్కడ గ్రీన్ పార్క్ హోటల్‌లో రూమ్ తీసుకున్న ఆమె, తనతో పాటు తన పర్సనల్ కెమెరామెన్‌ను లోపలికి తీసుకెళ్లారు. అయితే, హోటల్ రిసెప్షనిస్ట్ మరియు సిబ్బంది కెమెరాలను లోపలికి అనుమతించబోమని అడ్డుకున్నారు. కనీసం చిన్న కెమెరాను కూడా రూమ్‌లోకి తీసుకెళ్లకూడదని వారు నిబంధనలు విధించడంతో లక్ష్మికి కోపం వచ్చింది.

హోటల్ సిబ్బందితో వాగ్వాదం

ఈ సందర్భంగా ఆమె సిబ్బందిపై విరుచుకుపడ్డారు. నేను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగాను, ఎన్నో టాప్ హోటళ్లలో బస చేశాను. ఎక్కడా ఇలాంటి వింత నిబంధనలు చూడలేదు. నా పర్సనల్ రూమ్‌లోకి నా కెమెరామెన్‌ను తీసుకెళ్తే హోటల్ వాళ్లకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు. కనీసం తన కెమెరామెన్ కోసం వేరొక రూమ్ అడిగినా దానికి కూడా యాజమాన్యం నిరాకరించడం గమనార్హం. గతంలో ఇదే హోటల్‌లో తన సిబ్బంది బస చేసి ఫొటోలు తీసుకున్నారని, దానికి సంబంధించిన ఆధారాలు చూపించినా సిబ్బంది వినిపించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్ స్టాండర్డ్స్ బాగున్నా, సర్వీస్, రూల్స్ మాత్రం అర్థరహితంగా ఉన్నాయని ఆమె ఘాటుగా విమర్శించారు.

ప్రమోషన్ల జోరులో..

ఒక పక్క ఈ వివాదం నడుస్తుండగానే, మంచు లక్ష్మి తన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 'బూకి' ఈ నెల 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై ఆమె భారీ ఆశలే పెట్టుకున్నారు. షూటింగ్ సమయంలోనే తన నటనతో తమిళ తంబీలను ఆకట్టుకున్న లక్ష్మి, ఇప్పుడు ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. మంచు లక్ష్మి పోస్ట్ చేసిన వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. హోటల్ నిబంధనలు ప్రైవసీ కోసమే ఉండొచ్చని కొందరు అంటుంటే, సెలబ్రిటీల విషయంలో మరీ అంత కఠినంగా ఉండటం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.