పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో కొనసాగుతుంది. ఫస్ట్ డే వసూళ్లతో పోలిస్తే మూడో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలోనే ఉస్తాద్ కలెక్షన్లలో స్థిరత్వం లేకపోవడం ట్రేడ్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఉస్తాద్ తొలి రోజు రూ.34.75 కోట్ల నెట్ వసూలు చేయగా, రెండో రోజు కేవలం రూ.9.25 కోట్లకే పరిమితమైంది. మూడు రోజైన శనివారం రూ.9.25 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. మొదటి రోజు తర్వాత కలెక్షన్లు భారీగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ వసూళ్ళలో గ్రోత్ లేకపోవడం నెగటివ్ సిగ్నల్‌గా భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఇలానే కొనసాగితే.. సినిమా హిట్ అవ్వడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూడు రోజుల వసూళ్లు:
Sacnilk.com రిపోర్టు ప్రకారం: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే (మార్చి 19) సుమారు రూ.48 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇండియాలో రూ.34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు శుక్రవారం నాడుకేవలం రూ.9.25 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే చేసి నిరాశపరిచింది.
మూడు రోజైన శనివారం నాడు 3340 షోలలో 36 శాతం ఆక్యుపెన్సీతో రూ.9.15 కోట్లు(నెట్) వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఉస్తాద్ మూడు రోజుల్లో ఇండియా మొత్తం రూ. 52.90 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే ఇది రూ. 62.42 కోట్లకు చేరుకుంది. అయితే, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.9.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదు చేయడంతో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 71.67 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో సినిమా విడుదలైన ఫస్ట్ వీకెండ్ రూ.70 కోట్ల క్లబ్‌ను దాటింది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఉస్తాద్ బాక్సాఫీస్ వసూళ్లపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం!
►ALSO READ | OTT Review: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ థ్రిల్లర్.. మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్‌లు..
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే సుమారు రూ.140 కోట్ల షేర్, రూ.280 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంది. అయితే, శనివారం నుంచి 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ కూడా విడుదలవ్వడంతో 'ఉస్తాద్' కలెక్షన్లపై మరింత ప్రభావం చూపించింది. ఏదేమైనా నాలుగో రోజైన ఆదివారం కలెక్షన్లు కీలకం. వీకెండ్ బూస్ట్ లేకపోతే వీక్‌డేస్‌లో మరింత డ్రాప్ వచ్చే అవకాశం ఉంది.
ఉస్తాద్ కంటే గత సినిమాలకే ఎక్కువ కలెక్షన్లు:
పవన్ కళ్యాణ్ నటించిన గత సినిమాలతో పోలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ చాలా వెనకపడిపోయింది. భారీ డిజాస్టర్ అందుకున్న హరి హర వీరమల్లు సినిమాకు కూడా మిక్సెడ్ టాక్ వచ్చినప్పటికీ, తొలి మూడు రోజుల్లోనే రూ.64.65 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.
అదే సమయంలో OG సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లి, కేవలం మూడు రోజుల్లోనే రూ.121.70 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో, ఉస్తాద్ భగత్ సింగ్ మూడు రోజుల కలెక్షన్లు (రూ.52.90 కోట్ల నెట్) వీటితో పోలిస్తే భారీగా తక్కువగా ఉండటం గమనార్హం. దీంతో ప్రస్తుత రన్‌పై ట్రేడ్ వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
