OTT Review: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ థ్రిల్లర్.. మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్‌లు.. IMDB లో 9.1 రేటింగ్

OTT Review: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ థ్రిల్లర్.. మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్‌లు.. IMDB లో 9.1 రేటింగ్

తమిళంలో వచ్చిన లేటెస్ట్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఫోర్త్ ఫ్లోర్ (Fourth Floor). ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై ప్రశంసలు అందుకున్న ఈ మూవీ థియేటర్లో ప్రేక్షకుల్ని వణికించింది. ఓళ్లు గగుర్పొడిచే సీన్లు.. ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ని ఫుల్ ఎంగేజ్ చేసింది.

ఇపుడీ ఈ తమిళ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ట్రెండింగ్లో దూసుకుపోతోంది.. ఏకంగా అయిదు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో శుక్రవారం మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, టెంట్ కోటా వంటి ఓటీటీల్లోకి వచ్చి అలరిస్తుంది.

ఎల్‌‌‌‌‌‌‌‌.ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సుందరపాండి తెరకెక్కించిన ఈ మూవీ IMDBలో 9.1 రేటింగ్ సంపాదించుకుంది. ఇది ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. ఇందులో బిగ్ బాస్ తమిళ విన్నర్ ఆరి అర్జునన్, దీప్శిక, పవిత్ర,బేబీ శ్రీవర్షిని ప్రధాన పాత్రలు పోషించారు. హారర్ థ్రిల్లర్ జానర్ అభిమానులకు మంచి ట్రీట్ ఫోర్త్ ఫ్లోర్. థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో తప్పక చూసి వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.

కథేంటంటే:

ధీరన్ (ఆరి అర్జునన్) ఒక సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్. అతనికి ఒకరోజు తన మాజీ ప్రియురాలు అను (పవిత్ర) నుంచి ఫోన్ వస్తుంది. తనకు సాయం చేయమని కోరడంతో చెన్నైకి వస్తాడు. ఆమె చెప్పినట్టుగానే రాయల్ టౌన్ అనే ఒక ఐసోలేటెడ్ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఫోర్త్ ఫ్లోర్​లో ఉన్న ఫ్లాట్ నెంబర్​ 4Aలో దిగుతాడు.

కానీ.. అది దుమ్ము, సాలెగూళ్లతో నిండిపోయి ఉంటుంది. చాలా రోజులుగా అక్కడ ఎవరూ ఉండడం లేదని అతనికి అర్థమవుతుంది. అప్పటినుంచి ధీరన్​కు విచిత్రమైన కలలు వస్తుంటాయి.

అతన్ని ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఎవరో తోసేస్తున్నట్టు, అను ఒక చిన్న పిల్లాడితో దిగిన ఫొటో.. పదే పదే కలలో కనిపిస్తుంటాయి. అప్పుడే పొరుగున ఉన్న శ్వేత (దీప్‌‌‌‌‌‌‌‌షిక) అతనితో స్నేహం చేస్తుంది. ఆమె సాయంతో కలల మిస్టరీని ఛేదించాలి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాలి. 

ఎలా ఉందంటే:

దర్శకుడు ఎల్.ఆర్. సుందరపాండి ఈ చిత్రాన్ని స్లో బర్న్ నేరేషన్‌తో తీర్చిదిద్దాడు. కథ నెమ్మదిగా ముందుకు సాగుతున్నప్పటికీ, ప్రతి సీన్‌లో టెన్షన్ మెయింటైన్ అవుతుంది. ఊహించని ట్విస్టులు, ఒళ్లు గగుర్పొడిచే హారర్ మూమెంట్స్, స్లోగా బిల్డ్ అయ్యే టెన్షన్, క్లైమాక్స్‌లో షాకింగ్ రివీల్ సినిమా కథకు ప్రధాన బలంగా నిలిచాయి. దర్శకుడు ఎల్.ఆర్. సుందరపాండి ఈ చిత్రాన్ని స్లో బర్న్ నేరేషన్‌తో తీర్చిదిద్దాడు. కథ నెమ్మదిగా ముందుకు సాగుతున్నప్పటికీ, ప్రతి సీన్‌లో టెన్షన్ మెయింటైన్ అవుతుంది. 

నటీనటులు

అరి అర్జునన్ తన పాత్రలో నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషన్స్, భయం రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేశాడు. దీప్షిక కథలో కీలక పాత్ర పోషిస్తూ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించింది. పవిత్ర పాత్ర తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా, ఆమె స్టోరీకి ప్రధానంగా నిలిచింది.

టెక్నికల్ అనాలిసిస్

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ ఎఫెక్ట్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. డార్క్ విజువల్స్‌తో సినిమాటోగ్రఫీ మెప్పించింది. భయానక వాతావరణాన్ని బాగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ బాగుంది.