కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ కాంట్రాక్ట్కార్మికుల సమ్మె కారణంగా శుక్రవారం రెండోరోజు కూడా బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ పనులు నిలిచిపోయాయి. రెండు రోజుల్లో 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం జరిగింది. సుమారు 1.20లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్‌బర్డెన్ వెలికితీత నిలిచిపోయింది. ఆర్వీఆర్ ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ గోదావరిఖనిలో బేసిక్ వేతనంలో గుడ్‌విల్ కలిపి ఇస్తుందని, ఇక్కడ కూడా అదేవిధంగా ఇవ్వాలని కాంట్రాక్ట్వోల్వో డ్రైవర్లు డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై శుక్రవారం కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ పీవో ఆఫీస్‌లో చర్చలు జరిగాయి. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.మోహన్‌రెడ్డి సమక్షంలో ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ ఆర్వీఆర్ప్రతినిధులు, కార్మిక సంఘాల లీడర్లు, కాంట్రాక్ట్ డ్రైవర్లు చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి మూడు రోజుల టైమ్ ఇవ్వాలని, అప్పటి వరకు వాహనాలు నడపాలని జీఎం కార్మికులకు సూచించారు. వీఆర్ఎస్ కంపెనీ ఇన్చార్జి రాజన్న మాట్లాడితే వెహికల్స్ నడుపుతామంటూ కార్మికులు బయటకు వెళ్లిపోయారు. దీంతో రెండో రోజు సమ్మె కొనసాగింది.
