గ్లోబల్ సమ్మిట్‌ కు సెలబ్రిటీ లుక్..తరలి రానున్న సినీ,క్రీడా దిగ్గజాలు

గ్లోబల్ సమ్మిట్‌ కు  సెలబ్రిటీ లుక్..తరలి రానున్న సినీ,క్రీడా దిగ్గజాలు
  • ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణితో 90 నిమిషాల కచేరీ 
  • తెలంగాణ ప్రత్యేక నృత్యం ప్రదర్శించనున్న పద్మజారెడ్డి
  •  ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ లో పీవీ సింధు,అనిల్ కుంబ్లే, గుత్తా జ్వాలా
  •  క్రియేటివ్ సెంచరీ సాఫ్ట్ పవర్, ఎంటర్ టైన్మెంట్ లో సినీ దర్శకుడు రాజమౌళి, సుకుమార్ తదితరులు 
  • 27 ప్రత్యేక సెషన్లు..వివిధ రంగాలపై చర్చలు

 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పలువురు సెలబ్రిటీలు హాజరుకానున్నారు. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమ్మిట్ కు హాజరవు తుండటం విశేషం. ఒలింపిక్స్ లో పతకాలే లక్ష్యంగా స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ను ఈ సమ్మిట్ లో ఏర్పాటు చేశారు. క్వెస్ట్ కు పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. వాళ్లు పాల్గొని విలువైన సూచనలు చేస్తారు.

 హాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకువస్తానని ప్రకటించిన సీఎం సినీ రంగంలోని అంశాలపై చర్చించేందుకు సినీ ప్రముఖులను దిగ్గజాలను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించారు. రాజమౌళి, రితేష్ దేశ్ ముఖ్, సుకుమార్, గుణాత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్ర ముఖులు క్రియేటివ్ సెంచరీ సాఫ్ట్ పవర్, ఎంటర్ టైన్మెంట్ చర్చలో పాల్గొంటారు. ప్రపంచం అబ్బురపడేలా స్టూడియోల ని ర్మాణానికి కావాల్సిన ఎక్విప్ మెంట్, టె క్నాలజీ, స్థలం.. అవసరలపై ప్రధానంగా చర్చించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయడం విశేషం. అదే విధంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణితో 90 నిమిషాలపాటు సంగీత కచేరి ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలువనుం ది. పేరిణి శివతాండవంతోపాటు పలు రీతులతో కూడిన తెలంగాణ నృత్యాన్ని పద్మజారెడ్డి ఒక బ్యాలీగా ఈ సమ్మిట్ లో ప్రదర్శించనున్నారు.