మావోయిస్టు ఆర్ పీసీ డిప్యూటీ కమాండర్​అరెస్ట్

మావోయిస్టు ఆర్ పీసీ డిప్యూటీ కమాండర్​అరెస్ట్

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి జిల్లా చర్లలో మావోయిస్టు ఆర్​పీసీ(రివల్యూషనరీ పీపుల్స్​ కమిటీ) డిప్యూటీ కమాండర్​ను పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేశారు. చర్ల మండలంలోని పూసుగుప్ప–లెనిన్​ కాలనీ రోడ్డులో సీఆర్​పీఎఫ్​ 141బెటాలియన్​తో కలిసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనబడిన మావోయిస్టు ఆర్​పీసీ డిప్యూటీ కమాండర్ సోడె దేవాను అదుపులోకి తీసుకుని విచారించారు.

అతడు చత్తీస్​గడ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లా తరెం పోలీస్​స్టేషన్​ పరిధిలోని కోమటిపల్లి గ్రామానికి చెందినవాడని తేలింది. కోమటిపల్లి మావోయిస్టు పార్టీ ఆర్​పీసీ డిప్యూటీ కమాండర్​గా పనిచేస్తున్నట్లు భద్రాచలం ఏఎస్పీ పంకజ్​ పరితోష్​ వెల్లడించారు. 2019లో మావోయిస్టు పార్టీలో చేరిన దేవా డిప్యూటీ కమాండర్ స్థాయికి చేరుకున్నాడని,  చర్ల ఎల్​వోఎస్​తో కలిసి చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో 2022 ఆగస్టులో  పోలీసులను టార్గెట్​ చేస్తూ ల్యాండ్​మైన్​ ఏర్పాటు చేశాడని చెప్పారు.