జీతాలు చెల్లించాలంటూ కంపెనీలోని పొగ గొట్టం పైకి ఎక్కి నిరసన

జీతాలు చెల్లించాలంటూ కంపెనీలోని పొగ గొట్టం పైకి ఎక్కి నిరసన

జహీరాబాద్, వెలుగు : జీతాలు చెల్లించాలంటూ ఓ కార్మికుడు కంపెనీలోని పొగ గొట్టంపైకి ఎక్కి ఆందోళన చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌‌‌‌‌‌‌‌ మండల పరిధిలోని కొత్తూరు (బి) గ్రామ శివారులోని ట్రైడెంట్‌‌‌‌‌‌‌‌ షుగర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీలో జరిగింది. 11 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఈ నెల న కూతురి వివాహం చేసేందుకు కూడా డబ్బులు లేవంటూ కంపెనీలో పనిచేస్తున్న రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు అనే కార్మికుడు పొగ గొట్టం పైకి ఎక్కాడు.

జీతాలు చెల్లించి, ఫ్యాక్టరీని నడిపిస్తేనే కిందకు దిగుతానని, లేదంటే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో తోటి కార్మికులు కార్మిక సంఘం నాయకుడు ఉగ్గెల్లి రాములు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జిల్లా కార్మిక శాఖ అధికారికి సమాచారం ఇవ్వడంతో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. వారంతా రమేశ్‌‌‌‌‌‌‌‌బాబుతో మాట్లాడి కుమార్తె వివాహం కోసం రూ. 2 లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కిందకు దిగారు. అలాగే కంపెనీలో పనిచేస్తున్న 164 మంది కార్మికులకు జీతాలు చెల్లించేందుకు వారం రోజుల్లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వద్ద మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.