కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్‌‌‌‌‌‌‌‌

కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్‌‌‌‌‌‌‌‌

     చనిపోయిన మేకలతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో యువకుడి ధర్నా

కొత్తపెల్లి, వెలుగు : వీధి కుక్కలు తన మేకలను చంపేస్తున్నాయని, కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు చనిపోయిన మేకలతో కొత్తపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఛాంబర్‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా బాధితుడు అజీజొద్దీన్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ వీధి కుక్కల దాడిలో గతంలోనూ ఆరు మేకలు చనిపోయాయని, ఇప్పుడు మరోసారి దాడి చేయడంతో నాలుగు మేకలు చనిపోగా, మరో మేక గాయపడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

కొందరు వ్యక్తులు వీధికుక్కలకు మాంసం వేస్తూ పెంచుతుండడంతో అవి యథేచ్ఛగా తిరుగుతూ దాడులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని, కుక్కలకు టీకాలు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశాడు.