ప్రజాకోర్టులో 25 మందిని హతమార్చాం

ప్రజాకోర్టులో 25 మందిని హతమార్చాం

దండకారణ్యం స్పెషల్‍ జోనల్‍ కమిటీ

భద్రాచలం,వెలుగు: ఇటీవల చత్తీస్‍గఢ్‍ రాష్ట్రంలోని బీజాపూర్‍ జిల్లాలో నిర్వహించిన ప్రజాకోర్టు ద్వారా 25 మందిని హతమార్చామని మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్‍ జోనల్‍ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ గురువారం ప్రకటించారు. ఈమేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. బస్తర్‍ ఐజీ సుందర్‍రాజ్‍, బీజాపూర్‍ఎస్పీ త్రిలోచన్‍కశ్యప్‍లు మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు రహస్య ఏజెంట్లను నియమించారని ఆరోపించారు. దీనికి బాధ్యత వారే వహించాలని పేర్కొన్నారు. 12 మంది పోలీసు రహస్య సైనికులు, ఐదుగురు కోవర్టులు, 8 మంది పోలీస్‍ ఇన్‍ఫార్మర్లను చంపినట్లుగా చెప్పారు. గంగులూరు ఏరియా కమిటీ కార్యదర్శి విజ్జా గత కొంతకాలంగా పోలీసులకు కోవర్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇతని ద్వారా చాలామంది గ్రామాల్లో రహస్య ఏజెంట్లుగా చేరి, బ్యాంకు ఖాతాల్లో పోలీసుల ద్వారా నెలనెలా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. వీరంతా గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించారని, పలువురు గ్రామ నాయకులను హతమార్చారని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, వీరందరినీ ఆదివాసీల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి విచారించి చంపినట్లుగా వెల్లడించారు.

For More News..

నిజామాబాద్ ​ఎమ్మెల్సీ పోలింగ్​ ఇయ్యాల్నే

బీజేపీ కార్పొరేటర్ కు టీఆర్ఎస్ ఆఫర్‌​