మసూద్ అజార్ బతికే ఉన్నాడు: ఫ్యామిలీ సోర్స్

మసూద్ అజార్ బతికే ఉన్నాడు: ఫ్యామిలీ సోర్స్

జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజార్ చనిపోయాడా… బతికే ఉన్నాడా అన్నదానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కాలేయం క్యాన్సర్ తో మసూద్ అజార్ మరణించాడని ఆదివారం నాడు పాకిస్థాన్ సహా అంతర్జాతీయ వార్తా సంస్థల్లో వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ఐతే… పాకిస్థాలోని కొన్ని మీడియా సంస్థలు.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉందని అన్నాయి. తాజాగా… జైష్ ఎ మహ్మద్ సంస్థకు చెందిన ఓ నాయకుడు… మసూద్ అజార్ కుటుంబసభ్యుడు … తమతో మాట్లాడినట్టు జియోన్యూస్ ఓ ప్రకటన చేసింది. మసూద్ అజార్ చనిపోయాడన్న వార్తలో నిజం లేదని.. అతడు బతికే ఉన్నాడని జైషే అధినేత ఫ్యామిలీ మెంబర్ చెప్పినట్టు వివరించింది.

మసూద్ అజార్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని… ఐతే.. అనారోగ్యంతో బాధపడుతున్నాడని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ ఇటీవల చెప్పారు. మసూద్ చనిపోయాడన్న ఊహాగానాలపై జియోన్యూస్ ఖురేషీని సంప్రదించింది. ఐతే.. ప్రస్తుతం మసూద్ అజార్ ఆరోగ్యంపై తన దగ్గర సమాచారం లేదని ఆయన చెప్పినట్టు వార్తాసంస్థ వివరించింది.