‘వీర సింహారెడ్డి’ నుంచి మరో లిరికల్ సాంగ్

‘వీర సింహారెడ్డి’ నుంచి మరో లిరికల్ సాంగ్

‘వీర సింహారెడ్డి’గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు బాలకృష్ణ. దీంతో చిత్ర ప్రమోషన్స్ ను స్పీడప్ చేశారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆల్రెడీ జై బాలయ్య, సుగుణాల సుందరి అంటూ రెండు పాటలతో అంచనాలు పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్, సాంగ్ లపై సినిమాపై అంచనాలు పెంచాయి. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్’ అనే స్పెషల్ సాంగ్‌‌ను సంధ్య 35ఎంఎం థియేటర్‌‌‌‌లో  రిలీజ్ చేశారు. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్ధ మైత్రీ మేకర్స్ ట్వీట్ చేసింది. ‘మాస్ మొగుడు’ సాంగ్ ను జనవరి 03 రాత్రి 7.55 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. పోస్టర్ ఆకట్టుకొంటోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ ‌‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ ‌‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, విజయ్ ‘వారసుడు’ కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. గతంలోనూ పలుమార్లు బాలయ్య, చిరు మధ్య పొంగల్ వార్ జరిగింది. మరి ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.