నీటి తొట్టెలో డాక్టర్ ఫిష్ తో పాదాలకు మసాజ్

నీటి తొట్టెలో డాక్టర్ ఫిష్ తో పాదాలకు మసాజ్

ఈ రోజుల్లో పెడిక్యూర్‌‌‌‌ గురించి తెలీని వాళ్లుండరేమో! వేడి నీటి తొట్టెలో పాదాలను ఉంచి క్రీములు పూసి, మసాజ్‌‌ చేస్తే కాళ్ల నొప్పులు తగ్గి కొంత రిలీఫ్​ వస్తుంది. అయితే ఫిష్​పెడిక్యూర్‌‌‌‌ చేయించుకుంటే ఇంకాస్త మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు ఎక్స్​ఫర్ట్స్. ఇందుకోసం గర్రా రూఫా ఫిష్​లను వాడతారు. వీటినే ‘డాక్టర్‌‌‌‌ ఫిష్​’ అని కూడా అంటారు. ఇవి పాదాలపై ఉండే డెడ్‌‌ స్కిన్‌‌ను తినేస్తాయి. దాంతో కొత్త చర్మం వచ్చి పాదాలు మెరుస్తాయి. ఈ ఫిష్ ట్యాంకులను బెంగళూరు కేఎస్‌‌ఆర్‌‌‌‌ రైల్వేస్టేషన్‌‌లో ఏర్పాటు చేశారు. ప్యాసింజెర్స్‌‌ తమ ట్రైన్‌‌ కోసం వెయిట్‌‌ చేసేటప్పుడు టైమ్‌‌ పాస్‌‌ కోసం ఫిష్​ పెడిక్యూర్‌‌‌‌ చేయించుకోవచ్చు. దీంతో కొంతమంది ప్రయాణీకులు పెడిక్యూర్‌‌‌‌ చేయించుకుంటూ రిలీఫ్​ పొందుతున్నారు.