రాయదుర్గం ఐటీ కారిడార్లో భూములకు మరోసారి భారీ ధర.. ఎకరా ఎంత పలికిందంటే..

రాయదుర్గం ఐటీ కారిడార్లో భూములకు మరోసారి భారీ ధర..  ఎకరా ఎంత పలికిందంటే..

హైదరాబాద్ ఐటీ కారిడాల్ లో భూములకు రెక్కలు వచ్చాయా అన్నట్లుగా భారీ ధరలు పలుకుతున్నాయి. రెండు రోజుల క్రితం  TGIIC వేలంలో భూమికి ఎకరాకు 237 కోట్లు పలికిన విషయం తెలిసిందే.  లేటెస్టుగా 2026 జూన్ 01వ తేదీన జరిగిన వేలంలో మరోసారి భారీ ధర పలికింది.

సోమవారం నిర్వహించిన వేలంలో రాయదుర్గం ఎకరా భూమి204 కోట్ల రూపాయల పలికింది. ఈరోజు మొత్తం 5.09 ఎకరాలకు వేలం వేసింది TGIIC. 5 ఎకరాల వేలంతో వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు తెలిపారు. 

రెండు రోజుల క్రితం వేలంతో 1490 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు విడతల్లో కలిపి TGIIC కి దాదాపు 2500 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.