భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా సోనాపూర్ పీఎస్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధ ఫ్యాక్టరీని భద్రతాబలగాలు గుర్తించాయి. కోర్సాకోడోం, పాంగ్డు, కందుల్మార్ అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లిన బీఎస్‌ఎఫ్, డీఆర్జీ బలగాలు ఆయుధ ఫ్యాక్టరీని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ల ద్వారా సుమారు 1000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో వివిధ రకాల సైజుల్లో పైపులు, బీజీఎల్ ల్స్, ఎస్‌ఎల్‌ఆర్ మ్యాగజైన్లు, పిస్టల్ మ్యాగజైన్స్, టూల్ మోటార్, బ్రష్ బ్లూ పంపులు, కట్టర్ వీల్స్ వంటి మొత్తం 323 రకాల వస్తువులు ఉన్నట్లు భద్రతాబలగాలు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకొని నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు.
