మా నాన్నకు ఏది మంచిదో భగవంతుడు అది చేయాలి

మా నాన్నకు ఏది మంచిదో భగవంతుడు అది చేయాలి

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉంది. వెంటిలేటర్‌‌పై ఉన్న ప్రణబ్ రక్తప్రసరణ నిలకడగా ఉందని ఆర్మీ ఆస్పత్రి బులెటిన్‌లో తెలిపింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఆయన వేరే పరీక్షల కోసం సోమవారం ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేశారు. 84 ఏళ్ల ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ స్పందించారు. తన తండ్రి హెల్త్‌ గురించి ప్రార్థనలు చేస్తున్న వారితో పాటు ఆరా తీస్తున్న వారందరికీ మప్పిదాలు తెలిపారు.

‘గతేడాది ఆగస్టు 8న మా నాన్నను భారత రత్న పురస్కారం వరించింది. అది నాకు చాలా సంతోషకరమైన రోజు. సరిగ్గా ఏడాది తర్వాత ఆగస్టు 10న ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు ఏది మంచిదో భగవంతుడు అది చేయాలి. అలాగే సుఖాన్ని, దు:ఖాన్ని సమానంగా చూసేలా నాకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. మా నాన్న గురించి ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని షర్మిష్ట ట్వీట్ చేశారు.