కాంగ్రెస్‌ గురించే రాహుల్‌ గాంధీ ఆలోచించాలి

కాంగ్రెస్‌ గురించే రాహుల్‌ గాంధీ ఆలోచించాలి

సొంత ఇంటిని చక్కబెట్టుకోలేని వాళ్లు తమపై విమర్శలు చేయడమేంటని...రాహుల్ గాంధీపై ఫైరయ్యారు BSP చీఫ్ మాయావతి. తమపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ వంద సార్లు ఆలోచించుకోవాలన్నారు. దళితులు, BSPపై రాహుల్ గాంధీకి ఉన్న దురభిప్రాయం ఆయన మాటల్లోనే కనిపించిందన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాయావతి సరిగా పోరాడకపోవడం వల్లే బీజేపీ గెలిచిందని నిన్న రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. దీనిపై ఆమె ఇవాళ కౌంటర్ ఇచ్చారు. 

యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పరిస్థితి పిల్లిలా తయారైందని మాయావతి తెలిపారు. ఈ వ్యాఖ్యల వ‌ల్ల రాహుల్ గాంధీకి దళితులు, బీఎస్పీ ప‌ట్ల ఎలాంటి నీచ‌మైన భావాలు ఉన్నాయో తెలుస్తున్నాయ‌ని అన్నారు. మాది పార్లమెంటులో బలవంతంగా ప్రధానమంత్రినికి కౌగిలించుకున్న రాహుల్ గాంధీ లాంటి పార్టీ కాదని, ప్రపంచ వ్యాప్తంగా నవ్వులపాలైన పార్టీ కాదని మాయావతి విమర్శించారు.