ఆర్టీసీలో యూనియన్స్ ఉండవు : సజ్జనార్

ఆర్టీసీలో యూనియన్స్ ఉండవు : సజ్జనార్

ఆర్టీసీ మనుగడకు ఇబ్బంది లేదని..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీలో మళ్ళీ యూనియన్స్ పెడతామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కోవిడ్ తో ఆర్టీసీ రెండేళ్లు నష్టాల్లో ఉందని అయితే లాస్ట్ ఈయర్ నుంచి వాటి నుంచి బయటపడుతున్నామని అన్నారు. ఈ ఏడాది రూ. 1900  కోట్లు లాస్ కాకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

ఆర్టీసీలో 100 డేస్ ఛాలెంజ్ తీసుకున్నామని సజ్జనార్ చెప్పారు. ఒక్క రాఖీ పండుగ రోజే రికార్డ్ స్ధాయిలో రూ. 20 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. ప్రతి పండుగకు ఇలానే నడిపి ప్రయాణికుల మన్ననలు పొందుతామన్నారు. విద్యార్థులు బస్సులకు ఇబ్బంది పడుతుండడంతో మిగతా బస్సుల్లోనూ ప్రయాణించే అవకాశం కల్పించామని సజ్జనార్ స్పష్టం చేశారు. తార్నాకలో త్వరలోనే బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.