
- వాటర్‌బోర్డు మాన్సూన్ ప్లాన్‌పై ఎండీ సుదర్శన్‌రెడ్డి సమీక్ష
- చలివేంద్రాలను మరికొన్ని రోజులు కొనసాగించాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: వానల టైంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాటర్‌బోర్డు స్పెషల్టీమ్స్ పనిచేయాలని ఎండీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. డివిజన్ల వారీగా వాటర్ లాగింగ్, స్టాగ్నింగ్ పాయింట్లను గుర్తించి, వరద నీరు నిల్వకుండా చూడాలన్నారు. సోమవారం వాటర్‌బోర్డు హెడ్డాఫీసులో మాన్సూన్యాక్షన్ప్లాన్అమలుపై ఎండీ సుదర్శన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రోడ్లపై సీవరేజీ ఓవర్ ఫ్లో కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, డీప్ మ్యాన్ హోళ్లకు గ్రిల్స్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఇంకా ఎక్కడైనా గ్రిల్స్ ఫిట్టింగ్పనులు పెండింగ్ఉంటే వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజావాణితోపాటు వాటర్‌బోర్డుకు అందుతున్న ఫిర్యాదులపైన ఫోకస్పెట్టాలని సూచించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్టీమ్స్పనితీరుపై ఆరా తీశారు.
ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్‌బోర్డు సిటీలోని వేర్వేరుచోట్ల ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మరికొన్ని రోజులు కొనసాగించాలని ఎండీ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బోర్డు రెవెన్యూ కలెక్షన్వివరాలను డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమీక్షలో ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.