ఎంజీఎంలో వైద్య సేవలు బాగున్నాయి: ఎర్రబెల్లి దయాకర్ రావు

ఎంజీఎంలో వైద్య సేవలు బాగున్నాయి: ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఎంజీఎంలో వైద్య సేవలు బాగున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎంజీఎంలో ఆక్సిజన్ వసతి, అధునాతన వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కరోన భాదితులు ఎంజీఎం హాస్పిటల్ కు రావాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని.. భట్టి విక్రమార్క హాస్పిటల్స్ తిరుగుతూ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ తో భట్టి విక్రమార్క కుమ్మక్కై… ప్రభుత్వ డాక్టర్లను కించపరుస్తున్నారన్నారు ఎర్రబెల్లి.