రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి

రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి

భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. మే16 గురువారం రోజున అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.  జూన్ 6న కోల్‌కతాలో కువైట్‌తో జరిగే FIFA వరల్డ్ కప్ క్వాలిఫైయర్ గేమ్ తనకు చివరి అంతర్జాతీయ ఆట అని చెప్పుకొచ్చాడు.  

ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని సునీల్ ఛెత్రీ సుమారు 10 నిమిషాల నిడివి ఉన్న ఇదే వీడియోలో చెప్పడం విశేషం. 19 ఏళ్ల పాటు ఇండియన్ ఫుట్‌బాల్ కు అతడు సేవలందించాడు. ఇన్నేళ్లలో దేశం కోసం ఇన్ని మ్యాచ్ లు ఆడతానని తాను కలలో కూడా ఊహించలేదని ఈ సందర్భంగా ఛెత్రీ చెప్పాడు. కువైట్ తో జరగబోయే మ్యాచే నా కెరీర్లో చివరిది అని అతడు తెలిపాడు.

2005లో ఫుట్‌బాల్  కెరీర్ లోకి అడుగుపెట్టిన  సునీల్ ఛెత్రి.. 150  అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లలో భారత్ తరపున 94 గోల్స్ చేశాడు. పాకిస్థాన్‌తో  ఆడిన తొలి మ్యాచ్‌లోనే తన తొలి అంతర్జాతీయ గోల్‌ను కూడా సాధించాడు.  అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన టాప్-5 స్కోరర్‌ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు సునీల్ ఛెత్రి. 2022లో ఛెత్రీ ఘనతలను గౌరవిస్తూ ఫిఫా అతని పేరిట కెప్టెన్ ఫెంటాస్టిక్ అనే టైటిల్ తో ఓ డాక్యుమెంటరీ కూడా రూపొందించింది.