సుప్రీంకోర్టు కీలక తీర్పు: మనీలాండరింగ్ కేసులో అరెస్టులపై కండిషన్స్

సుప్రీంకోర్టు కీలక తీర్పు: మనీలాండరింగ్ కేసులో అరెస్టులపై కండిషన్స్

మనీలాండరింగ్ కేసులో వ్యక్తుల అరెస్ట్ పై సుప్రీంకోర్టు గురువారు (మే16) కీలక తీర్పును ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంపై కండిషన్స్ విధించింది. మనీలాండరింగ్ కేసులో ఫెడరల్ ఏజెన్సీలు దాఖలు చేసిన ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఈడీ అరెస్ట్ చేయకూడదనని చెప్పింది. 

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. 

ఫిర్యాదులో నిందితుడిగాఉన్న వ్యక్తిని అరెస్టు చేయడానికి ED అధికారులు PMLAలోని సెక్షన్ 19 కింద అధికారాలను ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. PMLAలోని సెక్షన్ 19 ED అధికారులు ఒక వ్యక్తిని తమ దగ్గర ఉన్న ప్రాథమిక సాక్షాధారారాల ఆధారంగా ఆ వ్యక్తి దోషి అని నమ్మడానికి వ్రాతపూర్వకంగా రికార్డ్ చేయడానికి ఆధారాలుంటే అరెస్టు చేయొచ్చని చెప్పింది. ముఖ్యంగా  అరెస్టుకు గల కారణాలను ఏజెన్సీ వ్యక్తికి  అంత త్వరగా తెలియజేయాలని తెలిపింది.