Antony Ruben: చివరి నిమిషంలో పుష్ప 2 టీమ్కి భారీ షాక్.. టీమ్ నుండి స్టార్ ఎడిటర్ అవుట్

Antony Ruben: చివరి నిమిషంలో పుష్ప 2 టీమ్కి భారీ షాక్.. టీమ్ నుండి స్టార్ ఎడిటర్ అవుట్

ఐకాన్ స్టార్(Icon star) ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2(Pushpa 2). స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సంవత్సరంన్నర నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కారణం.. పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించడమే. అంతేకాదు.. ఆ సినిమాకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడంతో పుష్ప పార్ట్ 2పై ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. 

పాన్ ఇండియా లెవల్లో భారీగా వస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల టీజర్, సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఈ రెండిటికి ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ చూసినా పుష్ప 2 గురించే చర్చ నడుస్తోంది. అయితే.. అన్నీ బాగానే ఉన్నాయి.. ఇక విడుదలే లేట్ అనుకుంటున్న సమయంల సినిమా ఎడిటర్ ఆంటోనీ రూబెన్ టీమ్ కి షాకిచ్చాడు. సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడట. 

అవును.. ఆంటోనీ రూబెన్ చేతిలో ప్రస్తుతం భారీ భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా డేట్స్ అడ్జెస్ట్మెంట్ కుదరకపోవడంతో ప్రాజెక్టు నుండి తప్పుకునుటున్నట్లు టీమ్ కి చెప్పడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే సుకుమార్ టీమ్ మాత్రం కూల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆంటోనీ ప్లేస్ లో నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఇదే విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రావడం ఖాయంగా కనిపిస్తోంది.