CSK vs RCB : చెన్నైతో మ్యాచ్ .. ఆర్సీబీకి వర్ష గండం.. రద్దయితే ఇంటికే

CSK vs RCB :  చెన్నైతో మ్యాచ్ .. ఆర్సీబీకి వర్ష గండం.. రద్దయితే ఇంటికే

మే 18న చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,   చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్ కు వర్షం పొంచి ఉన్నట్లుగా వాతావరణశాఖ వెల్లడించింది.  వాతావరణ నివేదికల ప్రకారం శనివారం ఉదయం బెంగళూరులో 45% వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రానికి 42% వర్షం కురిసే అవకాశం ఉంది.  మ్యాచ్ జరిగే సమయంలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందంది.   

ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ చేరాయి. వాటి సరసన చేరేందుకు సన్‌రైజర్స్‌కు మరో గెలుపు చాలు. ఈ క్రమంలో చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారింది.  మొదట 200 పరుగులు చేస్తే 18 పరుగుల తేడాతో విజయం లేదా ఛేదనలో 200 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో అందుకుంటే చెన్నై కంటే మెరుగైన రన్‌రేట్‌తో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. 

ఒక వేళ  వర్షం పడి మ్యాచ్ రద్దయితే మాత్రం బెంగళూరు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది.  చెన్నై నేరుగా ప్లే ఆఫ్ కు వెళ్తుంది. ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది.  వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచిన బెంగళూరు  ప్రస్తుతం 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.  ఈ సీజన్ లో కింగ్  విరాట్ కోహ్లీ 13 మ్యాచ్ లలో 66 సగటుతో 661 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీతో పాటుగా 5 హాఫ్ సెంచరీలున్నాయి.