- దేశంలో ప్రతి ఏడాది 14 లక్షల కొత్త కేసులు
- మెడికవర్ ఆంకాలజిస్టుల ప్రకటన క్యాన్సర్ విజేతలతో కార్యక్రమం
పద్మారావునగర్, వెలుగు : దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే నయం చేయడం సాధ్యమేనని సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ ఆంకాలజీ విభాగం డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో “యునైటెడ్ బై యూనిక్” నినాదంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో క్యాన్సర్‌ను జయించిన సర్వైవర్లు పాల్గొని తమ అనుభవాల వివరించారు. కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. నివేద్ రావు బల్మూరి మాట్లాడుతూ జీవితకాలంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, ప్రారంభ దశలో గుర్తిస్తే 50 శాతం కంటే ఎక్కువ కేసులను నివారించవచ్చని లేదా పూర్తిగా నయం చేయవచ్చన్నారు.
కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. గౌతమ్ మాట్లాడుతూ క్యాన్సర్‌పై భయం, అపోహల కారణంగా చికిత్స ఆలస్యమవుతోందన్నారు. అనంతరం క్యాన్సర్ నుంచి కోలుకున్న సర్వైవర్లు, వారి కుటుంబసభ్యులకు మెడికవర్ హాస్పిటల్స్ ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేశారు. చికిత్స అనంతరం కూడా నిరంతర వైద్య మద్దతు అందించడమే తమ లక్ష్యమన్నారు.
