రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో మిస్సైన స్టూడెంట్ మహిధర్ రెడ్డి ఆచూకీ లభ్యమైన విషయం తెలిసిందే. CC ఫుటేజ్ ఆధారంగా బాలుడి తిరుపతిలో గుర్తించారు పోలీసులు. దీంతో తిరుపతికి బాలుడి తలిదండ్రులు బయలుదేరారు. తిరుపతిలో బాబు ఏం చేస్తున్నావని పోలీసులు విచారించారు. దీంతో షాకింగ్ విషయాలు తెలిశాయి. తాను వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వచ్చానని బాబు చెప్పాడు. ఇంట్లో నుంచి రూ. 1000 తెచ్చుకుని రాత్రి కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లే ట్రైన్ ఎక్కినట్టు విచారణలో తేలింది. ఇవాళ ఉదయం బాబు తిరుపతిలో ఉన్నట్టు సమాచారం రావడంతో తెలంగాణ పోలీసులు వెళ్లి పట్టుకున్నారు.
Also Read:-కరీంనగర్ లో నాగపూర్ గ్యాంగ్.. రెండు వైన్ షాపుల్లో చోరీ
DNR కాలనీలోని మహిధర్ రెడ్డి అనే బాలుడు మీర్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 4న సాయంత్రం ట్యూషన్ వెళ్లి కనిపించకుండా పోయాడని బాలుడి పేరేంట్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మొన్నటి నుంచి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మొన్న సాయంత్రం ఓ బైక్ ని లిఫ్ట్ అడిగి...మీర్ పేట చౌరస్తాలో బస్సెక్కి..చాదర్ ఘాట్ బస్టాండ్లో దిగినట్లు CC ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. మలక్ పేట రైల్వే స్టేషన్ లో రైలు టికెట్ కొన్నట్లు గుర్తించారు. దీంతో గాలింపు చర్యలను స్పీడప్ చేశారు. ఇవాళ ఉదయం తిరుపతిలో పోలీసులు గుర్తించారు.