హైదరాబాద్ లో జూన్ 07 న మెగా సైక్లింగ్ రైడ్

హైదరాబాద్ లో జూన్ 07 న మెగా సైక్లింగ్ రైడ్

హైదరాబాద్​సిటీ, వెలుగు :   నగరంలో ఆదివారం మెగా సైక్లింగ్ రైడ్స్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ చైర్మన్, వరల్డ్ సైక్లింగ్ అలయన్స్ (బ్రస్సెల్స్) ఫస్ట్ ఉపాధ్యక్షులు డీవీ మనోహర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ ఈవెంట్ ఔటర్ సైక్లింగ్ ట్రాక్‌‌‌‌లోని నార్సింగి వద్ద ఉన్న స్మార్ట్‌‌‌‌బైక్ హబ్ దగ్గర ప్రారంభమవుతుందన్నారు. 

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రైడ్‌‌‌‌ను జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు. 5కే, 10కే రైడ్ విభాగాలలో 2,500 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొంటున్నట్టు తెలిపారు.