అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట వేళ మెగా కోడలు లావణ్య ఆసక్తికర పోస్ట్

అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట వేళ మెగా కోడలు లావణ్య ఆసక్తికర పోస్ట్

అయోధ్య(Ayodhya)లో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా పూర్తయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేతుల మీదుగా ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. నేటితో దాదాపు 500 ఏళ్ల భారత ప్రజలు కల సాకారమైంది. దీంతో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈ అపురూపమైన వేల మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోస్ట్ వైరల్ గా మారింది. శ్రీరాముడిపై ప్రత్యేకమైన పోస్ట్ చేశారు లావణ్య. సంప్రదాయ పద్దతిలో పట్టుచీర కట్టుకొని, సీతారాముల ప్రతిమలు ఉన్న ఆభరణాలను ధరించి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. 

శ్రీరామచంద్రుని నివాసమైన అయోధ్యలో జన్మించినందుకు.. ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూడటం అదృష్టంగా భావిస్తున్నాను. భగవాన్ శ్రీ రాముని ప్రాణ-ప్రతిష్టను చూడటం భారతీయులుగా అది మనకు గర్వకారణం. ఈ సందర్బంగా రామ్ పరివార్ నగలు ధరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాణ-ప్రతిష్ట వేడుక కేవలం అయోధ్యకు మాత్రమే కాదు.. మొత్తం దేశానికి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మనందరినీ ఏకం చేసే క్షణం. మన హృదయం నిండుగా భక్తితో వచ్చిన జై శ్రీరామ్ నినాదంతో.. అయోధ్యతో పాటు భారతదేశం అంతటా శాంతి, సద్భావన ప్రబలంగా ఉండాలని ప్రార్థిద్దాం.. అంటూ రాసుకొచ్చారు లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం మెగా కోడలి లావణ్య షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ఇక ఈ అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, ఆయన కుమారుడు రామ్ చరణ్ హాజరైన విషయం తెలిసిందే.