మెహిదీపట్నం, వెలుగు: మెహిదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మాణ పనుల నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ వైపు నుంచి రేతిబౌలి వైపు వెళ్లే వాహనాలను పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నం. 2 వద్ద మేరాజ్ కేఫ్ మీదుగా వెళ్లి పిల్లర్ నెం. 15 వద్ద తిరిగి ప్రధాన మార్గంలోకి చేరుకోవాల్సి ఉంటుంది.
అదేవిధంగా టోలిచౌకి, లంగర్ హౌస్ మీదుగా మాసబ్ ట్యాంక్ వెళ్లే వాహనాలు పిల్లర్ నం. 23 వద్ద యూటర్న్ తీసుకుని, రాంగ్ రూట్లో ప్రయాణించి పిల్లర్ నెం. 4, 5ల వద్ద సాధారణ మార్గంలోకి రావాలని సూచించారు.

