రానున్న 3 గంటల్లో ‘గ్రేటర్’లో వర్షం పడే చాన్స్

రానున్న 3 గంటల్లో ‘గ్రేటర్’లో వర్షం పడే చాన్స్

రాగల మూడు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని చెప్పారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, జగిత్యాల్, ఖమ్మం జిల్లాలో రాగల మూడు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణవాఖ అధికారులు చెప్పారు. ఈనెల 18వ తేదీన ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ఈరోజు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 16వ తేదీ కూడా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయని అన్నారు.