ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ రైడ్స్.. రూ.15 వేలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు

ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ రైడ్స్.. రూ.15 వేలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు

ఏసీబీ అధికారులు రోజుకో రైడ్స్ జరిపినా.. అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు. యథేచ్చగా లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. గురువారం (ఏప్రిల్ 09) ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఏసీబీ రైడ్స్ లో  FRO, జూనియర్ అసిస్టెంట్లు రెడ్ హ్యాండెడ్ గా దొరకటం చర్చనీయాంశంగా మారింది. 

బోథ్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.  15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా FRO ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురామ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.  

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్బన్ పార్క్ లో మొక్కలకు నీరు పోసిన వ్యక్తికి బిల్లు మంజూరు చేసేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు తాము చెప్పినట్లుగా చేయాలని.. చెప్పిన సమయంలో డబ్బులు ఇవ్వాలని సూచించారు. ఏసీబీ అధికారులు చెప్పినట్లుగా బాధితుడు డబ్బులు ఇస్తుండగా.. మాటు వేసి ఫారెస్ట్ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.