- మెట్టు సాయి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో సీఎం ఫొటోకు పాలాభిషేకం
హైదరాబాద్, వెలుగు: రైతు బాంధవుడు సీఎం రేవంత్రెడ్డి అని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు.
‘రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. సీఎం రైతు భరోసా రెండో విడత నిధులు విడుల చేశారని ప్రశంసించారు.

