దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌కు చెందిన నెవర్‌ల్యాండ్ ఎస్టేట్ అమ్ముడుపోయింది. కాలిఫోర్నియాలో ఉన్న ఆ ఎస్టేట్‌ను అమెరికాకు చెందిన బిలియనీర్ రోన్ బుర్కిలీ లాస్ ఈ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. సుమారు 2.2 కోట్ల డాలర్లుకు నెవర్‌ల్యాండ్ ను కొన్నారు.
2009లో మూన్‌వాకర్, కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. 2700 ఎకరాలు ఉన్న నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను మైఖేల్ అత్యంత అద్భుతం తీర్చదిద్దారు. పీటర్స్ పాన్ స్టోరీలోని ఊహాత్మక ద్వీపం గుర్తుకు వచ్చేలా నెవల్ ల్యాండ్ అని పేరు పెట్టారు. కానీ నెవర్‌ల్యాండ్ ఎస్టేట్ మైఖేల్ కెరీర్‌లో ఓ మచ్చగా కూడా మిగిలింది. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు మైఖేల్ ఇక్కడే పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మైఖేల్ జాక్సన్ మరణించిన తర్వాత నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను సైకామోర్ వ్యాలీ రాంచ్‌గా పేరు మార్చారు.
మోంటానాకు చెందిన బిజినెస్ మెన్ వ్యాపారవేత్త రోన్ బుర్కిలీ .. జాక్సన్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. 2015లో ఈ ఎస్టేట్‌ను 100 మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ బుర్కిలీ కేవలం 22 మిలియన్ల డాలర్లకే ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్నట్లు ఆయన తరపు ప్రతినిధి తెలిపారు. నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను మైఖేల్ జాక్సన్ 1980లో 20 మిలియన్ల డాలర్లకు కొన్నారు.
