ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల ఫొటోకు క్షీరాభిషేకం

ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల ఫొటోకు క్షీరాభిషేకం
  • భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏండ్లుగా ప్రజలకు సేవ చేస్తూ మన్ననలు అందుకున్నారని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. 

తుమ్మల 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై శనివారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్ లో అభినందన సభ నిర్వహించి, ఆయన ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. పెరిక కార్పొరేషన్​ వైస్​ చైర్మన్​ బుడగం శ్రీనివాసరావు, సర్పంచ్​ పూనెం కృష్ణదొర, తుమ్మల అభిమానులు ఎస్ఏ రసూల్, యశోద రాంబాబు పాల్గొన్నారు.