ఈటల నువ్వు ఎక్కువ ఊహించుకున్నవ్.. కేసీఆర్ ఒక లెజెండ్

V6 Velugu Posted on May 04, 2021

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒక మేక వన్నె పులి అని.. బీసీ ముసుగు కప్పుకున్న పెద్ద దొర అని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల కరీంనగర్ లో బీసి, హైదరాబాద్ లో ఓసి అని ఆయనకు సీఎంను విమర్శించే స్థాయి లేదన్నారు. ఈటల ఏనాడూ బీసీల సంక్షేమం కోసం మాట్లాడలేదని.. ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా  అని ప్రశ్నించారు. కమలాపూర్ నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో ఈటల పాములా చేరాడని.. సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకోమన్నారు.

మీరు బీసీలను ఎదగకుండా చేశారని.. టీఆర్ఎస్ బీఫామ్ మాకు పవిత్ర గ్రంధం అన్నారు. బీ ఫామ్ మీద పోటీ చేసిన వారిని  ఓడించే ప్రయత్నం చేశారన్నారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు ఈటల ఎలా సంపాదించడని.. నీకు నువ్వు పెద్దగ ఊహించుకున్నావ్ అన్నారు. పార్టీలో విభజన తెచ్చే ప్రయత్నం చేశావ్ అన్నారు. పార్టీ ఓడితే ఈటల నవ్వుతారు, గెలిస్తే మొహం మాడ్చుకుంటారు. ఈటల ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీల నాయకులతో టచ్‌ లో ఉన్నారన్నారు. అందుకే వారు మద్దతు ఇస్తున్నారని. హుజూరాబాద్‌ లో కేసీఆర్ బొమ్మతో ఈటల గెలిచాడని.. మీరు ఆరు సార్లు గెలవడం మీ గెలుపు కాదు కేసీఆర్‌ది అన్నారు. కేసీఆర్ ఒక లెజెంబ్ అని.. కేసీఆర్ బొమ్మ వల్లనే జానారెడ్డి లాంటి నాయకులు ఓడిపోయారన్నారు. ఎంపీపీగా ఉన్న కెప్టెన్ లక్ష్మికాంతరావు భార్య మీద కూడా అవిశ్వాసం పెట్టించారన్నారు. హుజురాబాద్‌ లో త్వరలో పర్యటన చేస్తామని తెలిపారు గంగుల కమలాకర్.

Tagged TRS, CM KCR, COMMENTS, etela rajendar, Minister Gangula Kamalakar,

Latest Videos

Subscribe Now

More News