
కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్ లో అర్బన్ మిషన్ భగీరథ పనులపై మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కలెక్టర్ శశాంక, ఇతర అధికారులు హాజరయ్యారు. అయితే భగీరథ పనుల్లో ఆలస్యం జరుగుతుండటం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల జాప్యం పై అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానేరు డ్యామ్ లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నప్పటికీ నీటి సరఫరాలో ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ట్రయల్ రన్ లోని లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు. తాగునీటి కష్టాలు తీర్చడమే ప్రభుత్వం లక్ష్యమని, త్వరలో నగర వాసులకు స్వచ్చమైన తాగునీరు అందించాలని ఆయన అన్నారు.