కేసీఆర్ ఇక్కడ ఎందుకు పుట్ట లేదని మిగిలిన రాష్ట్రాల ప్రజలు బాధపడుతున్నారు : మంత్రి గంగుల

కేసీఆర్ ఇక్కడ ఎందుకు పుట్ట లేదని మిగిలిన రాష్ట్రాల ప్రజలు బాధపడుతున్నారు : మంత్రి గంగుల

 ♦ కేసీఆర్ వెంటే బీసీలు 

 ♦ యాదవులు కుల దైవం మల్లన్న దేవుడిని పక్కన పెట్టి కేసీఆర్ నే దేవుడిగా కొలుస్తున్నారు

బీసీలు బీజేపీ వెంట ఉన్నారని ఆ పార్టీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు మంత్రి గంగుల కమలాకర్.  బీసీలు బీజేపీ దరిదాపులకు కూడా రారన్నారు. బీసీలు బతికున్నన్ని రోజులూ సీఎం కేసీఆర్ వెంట ఉంటామన్నారు.

తెలంగాణ గడ్డపై న వున్న ప్రతి బీసీ ఎప్పటికీ కేసీఆర్ కు ఋణపడి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మెజార్టీ బీసీల మద్దతు టీఆర్ఎస్ కే  ఉందన్న గంగుల.. బీసీలు ఏం చూసి బీజేపీ వైపు పోతారన్నారు.

తెలంగాణ రాకముందు బీసీ విద్యార్థులు చదవడానికి సరిపడా స్కూల్స్ లేవు.. తెలంగాణ వచ్చాక బీసీలకు 200 ల గురుకులాల ను ఏర్పాటయ్యాయని అన్నారు. యాదవులు వాళ్ళ కుల దైవం మల్లన్న దేవుడిని పక్కన పెట్టి కేసీఆర్ నే దేవుడుగా కొలుస్తున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్రం లో బీసీ సంక్షేమానికి ఒక శాఖ, మంత్రి ఎందుకు లేరని ప్రశ్నించారు. త్వరలోనే ప్రధాని ని కలిసి ప్రత్యేకంగా ఒక శాఖ పెట్టాలని కోరుతామన్నారు.  బీసీలకు కేసీఆర్ దైవ సమానం.. కేసీఆర్ ను వదిలి వెళ్ళరని చెప్పారు.

కేసీఆర్ తెలంగాణ లోనే ఎందుకు పుట్టాడు. మన దగ్గర ఎందుకు పుట్టలేదని అన్నీ రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారని జోస్యం చెప్పారు. ప్రజలంతా కేసీఆర్ దేశ్ కి నేత కావాలని కోరుకుంటున్నారు.. ఖచ్చితంగా అవుతారు. ఇప్పటికే బీసీల ఆత్మగౌరవ భవనాలకు భూమి కేటాయించాం. త్వరలోనే అందరికి కేటాయిస్తాము

నాయి బ్రాహ్మణులకు శిక్షణ ఇస్తున్నము.. రూ.లక్షతో ఆధునీకర సెలూన్ లు త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు.

బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్ష పదవి ఒక డమ్మీ పోస్ట్

బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఫెయిల్ అయ్యారని అన్నారు ఎమ్మెల్యే వివేక్ గౌడ్. మూడు సార్లు ఓడిపోయాడు

బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్ష పదవి ఒక డమ్మీ పోస్ట్ . ఈ పోస్ట్ కు ఎందుకు పనికి రాని వారికి ఇవ్వాలని లక్ష్మణ్ కు ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తే పెద్ద నాయకులు కాలేరన్న వివేక్ ..కేసీఆర్ అగ్ర కులస్తుడే కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ లంటే కుటుంబ సభ్యులుగా చూస్తారని అన్నా ఎమ్మెల్యే వివేక్ గౌడ్.