హరితహారం కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు

హరితహారం కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు

కరీంనగర్ జిల్లాలో హరితహారం పెద్ద ఎత్తున చేపట్టాల‌న్నారు. హరితహారంపై జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కాంక్రీట్ జంగల్ గా ఉన్న నగరాన్ని హరితవనంగా మార్చాలన్నారు. హరితహారం కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు.

హరితహారానికి నిధుల కొరత లేదన్నారు. అవసరమైతే పట్టణ ప్రగతి నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 43 లక్షల మొక్కలు నాటాలని, వాటిలో 85 శాతం బ్రతికే విధంగా అధికారులు ,ప్రజాప్రతినిధులు ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

జిల్లా సరి హద్దుల నుంచి జిల్లా కేంద్రం వరకు ఆర్అండ్ బీ రోడ్లకు ఇరువైపులా 3 వరుసలు చెట్లు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ, ప్రభుత్వ స్థలాలను గుర్తించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతి, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ఫారెస్ట్ అధికారులు హాజ‌ర‌య్యారు.

minister gangula kamalakar review on harithaharam at karimnagar