జేఈఈ మెయిన్స్, నీట్ విద్యార్ధులకు ఉచిత మాక్ టెస్ట్ పేపర్లు

జేఈఈ మెయిన్స్, నీట్ విద్యార్ధులకు ఉచిత మాక్ టెస్ట్ పేపర్లు

జేఈఈ మెయిన్స్, నీట్ విద్యార్ధులకు ఉచిత మాక్ టెస్ట్ పేపర్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్స్, నీట్ ‌‌2022 పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధుల కోసం అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులతో 60 మాక్ టెస్ట్ మోడల్ పేపర్లను సొల్యూషన్స్ తో పాటుగా రూపొందించామని పేర్కొన్నారు.  ఈ ప్రశ్నపత్రాల eBOOK ను రిలీజ్ చేశామని తెలిపారు. విద్యార్ధుల కోసం ఉచిత స్టడి మెటీరియల్ అందిస్తున్న సంస్థ నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 9133607607 ఫోన్ నెంబరుకు '2022' అని వాట్సాప్ మెసేజ్ పంపటం ద్వారా లేదా calcusindia.com వెబ్ సైట్ ద్వారా టెస్ట్ పేపర్లను ఉచితంగా పొందొచ్చని వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఈ పేపర్లను పొందొచ్చన్నారు. https://bit.ly/3zrtm2G ను ఉపయోగించి టెస్ట్ పేపర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.